కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు
- తొలి పుణ్యస్నానం ఆచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు
- 12 రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలు
- గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల పవిత్ర త్రివేణి సంగమం ఇది
- భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ఈ రోజు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5:43 గంటలకు ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పవిత్ర స్నానం చేశారు. తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఈ పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమే కాళేశ్వరం. దేశంలో ప్రయాగ్రాజ్ తర్వాత ఇలాంటి త్రివేణి సంగమం ఉన్న రెండో ప్రదేశం ఇదే. ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి, పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ 12 రోజుల పుష్కరాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, దేవాదాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.